అదిరే టెక్నాలజీతో ఒక్క రోజులోనే 3డి ప్రింటింగ్ బాత్ రూం నిర్మించారు 

ఈ ఫొటోలో కనిపిస్తున్నది 3డీ ముద్రిత స్నానపు గది. సింగపూర్‌లోని నాన్‌యాంగ్‌ టెక్నలాజికల్‌ విశ్వవిద్యాలయ ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్ల బృందం దీన్ని ఒకే రోజులో సిద్ధం చేసింది. ఒకే రోజులో మొత్తం బాత్రూం వ్యవస్థను శాస్త్రవేత్తలు త్రీడీ సాంకేతికతతో రూపొందించారు.  

సాధారణ స్నానపు గదుల కంటే ఇది పర్యావరణహితంగా ఉంటుందని చెబుతున్నారు. స్థిరాస్తి సంస్థలు ఈ టెక్నాలజీతో చౌకగా, వేగంగా, నాణ్యంగా ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ బాత్‌రూం యూనిట్స్‌(పీబీయూ)ను నిర్మించొచ్చని అన్నారు. 

3డీ ముద్రిత స్నానపు గది గోడల నిర్మాణానికి వాడిన కాంక్రీటు, సంప్రదాయ కాంక్రీటు కంటే మన్నికైందన్నారు. ఇటుక, ఇసుక, సిమెంటుతో గోడల నిర్మాణానికి పట్టే దానిలో సగం సమయంలోనే పని పూర్తవుతుందన్నారు. స్నానపు గది లోపల అద్దం, టాయులెట్‌ బౌల్‌, సింక్‌, సిరామిక్‌ టైల్‌ వాల్స్‌, ఫ్లోరింగ్‌ పనులకు 5రోజులు పడుతుందని చెప్పారు. అందులో డ్రైనేజీ వ్యవస్థ, పైపులను నిర్మించారు.

అందులో సింక్, అద్దం, షవర్, టైల్స్, గోడలు, ఫ్లోరింగ్, టాయిలెట్‌ ఇలా అన్నింటినీ ఏర్పాటు చేసి ఒక్క రోజులోనే బాత్రూం మొత్తాన్ని వాడుకునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. కాంక్రీట్‌ మిశ్రమాన్ని రోబో.. పొరలుపొరలుగా పోస్తూ బాత్రూంను పోతపోస్తుంది.ఈ సాంకేతికత ద్వారా సంప్రదాయ బాత్రూంల నిర్మాణం కన్నా 30 శాతం తక్కువ వ్యవధిలో నిర్మించవచ్చని తెలిపారు. కాంక్రీట్‌తో నిర్మించే వాటితో సమానంగా దృఢంగా ఉంటుందని చెప్పారు.
 

న్యూస్ టెక్నాలజీ 3డీ బాత్ రూం సింగపూర్‌ నాన్‌యాంగ్‌ టెక్నలాజికల్‌ విశ్వవిద్యాలయ ఇంజనీర్లు స్నానపు గది